
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026
వైకుంఠపురంకాలనీనాదర్గుల్లో ,బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు,ఘనంగా,నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కాలనీ,నివాసులైన పెద్దలు బొట్ట కొండయ్య, వెంకటేష్ అయితపాగా, శ్రీకాంత్ గుంజ, చందు వరికుప్పల, మురళీధర్, రమేష్ పంతులు, వెంకటేష్ టీచర్, శ్యామ్, రవి, నరేందర్, నాగేష్, డేవిడ్ తదితరులు, అలాగే యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులు మరియు కాలనీ పెద్దలు పాల్గొని B. R. Ambedkar గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, సమాజానికి చేసిన అమూల్య సేవలను స్మరించుకున్నారు.వక్తలు మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి విలువలను ఆచరిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, యువజన సంఘం ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో అందరికీ స్వీట్లు పంపిణీ చేయబడినవి.ఇదిలా ఉండగా, నూతనంగా ఏర్పాటైన అంబేద్కర్ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా బొట్ట కొండయ్య నియమితులైన సందర్భంగా కమిటీ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే, కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన బొట్ట కొండయ్య గారికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
