
హైదరాబాద్:(శ్రీరామ్ చక్రి న్యూస్)14/4/2026:ఈరోజు మీర్ పేట్ కార్పొరేషన్ 2 అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ మరియు,ప్రధాన కార్యదర్శులు సిద్దాల శ్రీనివాస్, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు.అధ్యక్షులు తులసి ముకేష్ ముదిరాజ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా తులసి ముకేష్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం సాధనలో ఆయన చేసిన కృషి అపారమని, దేశానికి చేసిన సేవలు , సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలించడంలో కీలక పాత్ర ,సమానత్వం, న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.అదేవిధంగా విద్యా ప్రాముఖ్యతపై అంబేద్కర్ గారు ఇచ్చిన సందేశాలను గుర్తు చేస్తూ, ప్రతి యువకుడు విద్యను ఆయుధంగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించాలనే అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ సభ్యులు సుల ప్రభాకర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ సోమేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గౌరీ శంకర్, గాజుల మధు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
