
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026,ఈ రోజు జిహెచ్ఎంసి 60వ డివిజన్, శ్రీ సాయి కృపా నగర్ కాలనీ లో నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్, శ్రీ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ గారు పాల్గొని, పూలమాలలతో డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా, తన సొంత ఖర్చులతో, అనిల్ యాదవ్ గారు జిహెచ్ఎంసి 60వ డివిజన్ లోని పారిశుద్ధ సిబ్బంది, ఎలక్ట్రిషన్స్, వాటర్ మెన్, చెత్త సేకరణ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి శాలువాలతో సన్మానించారు. నగదు చిరు కానుకలను అందజేసి, మౌలిక సదుపాయాలు అందించడంలో కిందిస్థాయి సిబ్బంది చేస్తున్న అద్భుతమైన సేవలను అభినందించారు.డాక్టర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కీలక పాత్రను కూడా ఈ కార్యక్రమంలో కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దోమలపల్లి రాజ్ కుమార్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అబ్బనమొని గోపి యాదవ్, కాలనీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మాజీ అధ్యక్షులు బల్వంత్ రెడ్డి, ఆకుల హరీష్, కాలనీ అసోసియేషన్ సభ్యులు సుందర్ రాజు, సహదేవ్, జక్కుల గోపాల్ యాదవ్, రూప్ కరణ్, బక్కతట్ల కృష్ణ యాదవ్ ఇతరులూ పాల్గొన్నారు.
