తమ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు

మామిళ్లగూడెం, జూన్ 1 : తమ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్.. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
