కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు

బాన్సువాడ, జూన్ 1: కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చి, అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రెండున్నరేండ్ల పాలనలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం చెందిందన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్రెడ్డి.. 2034 వరకు తానే సీఎంనని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. సోమవారం బాన్సువాడలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు
