“నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు విరామమివ్వం. మా తెలంగాణను మాకు ఇచ్చేదాకా త్రికరణశుద్ధితో పోరాడుతూనే ఉంటాం.

ఖమ్మం, జూన్ 1 : “నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు విరామమివ్వం. మా తెలంగాణను మాకు ఇచ్చేదాకా త్రికరణశుద్ధితో పోరాడుతూనే ఉంటాం. ఎన్ని నిర్బంధాలనైనా ఎదుర్కొంటూనే ఉంటాం.” అనే నినాదాలతో తెలంగాణ ఆకాంక్ష ప్రతిధ్వనించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గొంతెత్తి గర్జించింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. సీమాంధ్ర పాలకుల ప్రాంతీయ వివక్షపై పిడికెళ్లెత్తింది ఖమ్మం జిల్లా. అదీగాక, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు పురుడు పోసిందీ; తొలి, మలి దశ ఉద్యమాల్లో మడమతిప్పని పోరాట పటిమను ప్రదర్శించిందీ ఉద్యమ ఖిల్లానే.
