మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్తన్నది మా చిన్నప్పటి నుంచి విడదీయలేని బంధం

మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్తన్నది మా చిన్నప్పటి నుంచి విడదీయలేని బంధం. మేము ఒకే తల్లికి పుట్టిన ఆవులం. దాదాపు ఐదేండ్ల సంది మా యజమాని ఇంట్ల ఉంటున్నం. మేము, మా యజమానికి అండగా నిలిచినం. రోజు దాదాపు 8 లీటర్ల పాలిస్తున్నం. ఇవి అమ్మగా రూ.500లకుపైగా డబ్బులు వస్తున్నాయి.
