ఇది ఎలిగేడు మండలం ముప్పిరితోట-సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామాలకు వేసిన బీటీ రోడ్డు ఇది. ఐదు నెలల క్రితమే రూ.1.25 కోట్ల వ్యయంతో 4.27 కిలో మీటర్ల దూరం వరకు నిర్మించగా, కుదురుపాక ఎల్లమ్మ చెరువు నుంచి ఓవర్లోడ్తో లారీలు, టిప్పర్లు వెళ్తుండడంతో ఇలా పూర్తిగా దెబ్బతిన్నది.

ఎక్స్కవేటర్తో మట్టిని తోడి లారీల్లో నింపుతూ కనిపిస్తున్న చిత్రం సుల్తానాబాద్ మండలం కొదురుపాక ఎల్లమ్మ చెరువులోనిది. అయితే, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువులో కేవలం మూడు ఫీట్ల లోతు వరకు మాత్రమే తీయాలని అనుమతులు ఇచ్చారు. కానీ, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆరు ఫీట్ల వరకు మట్టిని తోడారు. ఇంత దర్జాగా తీస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనలకు పాతరేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
