వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్నారు.

ఆదిలాబాద్, జూన్ 3 : వానకాలం సీజన్ మరో వారం రోజుల్లో ప్రారం భం కానుంది. రైతులు భూములు సిద్ధం చేసి విత్తనాలు నాటేందుకు ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గతేడాది వానకాలం రైతులకు కలిసిరాకపోవడంతో ఈ ఏడాది ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో ఏటా వానకాలంలో 5.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయి. నల్లరేగడి భూములు, అధిక వర్షపాతం కారణంగా పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. దా దాపు 4 లక్షల ఎకరాల్లో పండిస్తారు. సోయా, కంది, మక్క పంటలు వేస్తారు.
