ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో జరిగింది. ఎల్లాపటార్ గ్రామానికి చెం దిన 9 మంది కూలీలు శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆత్రం అక్బర్ షా(33) ఆదివారం ఉదయం మృత్యువాత పడ్డాడు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ జాబ్‌కార్డ్‌లు ఉన్నాయి. వీరికి 100 రోజుల పని దినాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇక పనుల ప్రదేశాల్లో ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో కూలీలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. నీడ, నీరు, ఫస్ట్‌ఎయిడ్ కిట్లువంటి వసతులు కల్పించకపోవడంతో కూలీలు అనేక అవస్థలు పడాల్సి వస్తున్నది.
