ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తున్నది. హింసా రాజకీయాలను ప్రేరేపిస్తూ.. రౌడీ, గూండా రాజకీయాలు చేస్తూ, మితిమీరిన దౌర్జన్యకాండకు తెగబడుతున్నది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నరు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్, రైతు భరోసా.. ఇలా మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి. లేదంటే కాంగ్రెస్కు పుట్టగతలు కూడా ఉండవు. రాబోయే 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుందని అనుకోవడం లేదు’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక సందర్భంగా క్యాతన్పల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు.
