రాష్ట్రంలో చాలా బస్టాండ్లు 20 నుంచి 40 ఏళ్ల పైబడినవేనని, అందుకని.. వాటిని కూల్చివేయకుండా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్తుంటామని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ నాగిరెడ్డి అన్నారు.

పాల్వంచ, ఏప్రిల్ 6: రాష్ట్రంలో చాలా బస్టాండ్లు 20 నుంచి 40 ఏళ్ల పైబడినవేనని, అందుకని.. వాటిని కూల్చివేయకుండా జాగ్రత్తగా నిర్వహించుకుంటూ వెళ్తుంటామని ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ నాగిరెడ్డి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన.. వైరా, మధిర, పాల్వంచ బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బస్టాండ్ల అభివృద్ధికి ఏమేమి చేయొచ్చో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రద్దీ బస్టాండ్లను అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని అన్నారు. అదేవిధంగా, నాన్ ట్రాఫిక్ రెవెన్యూ సాధించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయోమో పరిశీలించనున్నట్లు తెలిపారు.
