మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 : మా కార్పొరేటర్లను పార్టీ మారమని స్థానిక ఎమ్మెల్యేతోపాటు కొందరు అధికార పార్టీ నేతలు బేరసారాలకు దిగుతున్నారని.. అభివృద్ధి అంటే సహకరించినం.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార పార్టీ నేతలపై ఆయన ఫైర్ అయ్యారు. మీరు ఉండేది ఇంకా రెండున్నర ఏండ్లే బెదిరిస్తే భయపడేది లేదు.. అంటూ హెచ్చరించారు. మా పార్టీ కార్పొరేటర్లకు డ బ్బులు ఇస్తాం పదవులు ఇస్తాం వ్యాపారాలు చేసుకో ండి పోలీసులతో స హకరిస్తాం లేకపో తే ఫండ్స్ ఇవ్వం.. కే సులు పెట్టి స్తా ం.. అం టూ
