యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

మర్రిగూడ : యూరియా బుకింగ్ యాప్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియ కొరతను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలో మెరుపు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపుల గంటపాటు వాహనాల రాకపోకలు స్థంభించిపోయయి. రైతుల పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు చేశారు.
