ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి కొండా సురేఖకు మేస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో ఆమె నాగోబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని మంత్రి ప్రార్థించారు.
