అంతర్ జిల్లాల సాఫ్ట్‌బాల్ అండర్-17 (బాలబాలికల) టోర్నమెంట్, ఎంపికల పోటీల ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు.

తాను ఎప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి, వేల్పూర్ వేదికగా రాష్ట్ర స్థాయి ఈవెంట్‌ను నిర్వహించాలన్న ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని మరే నియోజకవర్గంలో లేని విధంగా, బాల్కొండ నియోజకవర్గంలో రెండు ఇండోర్ స్టేడియంలు కమ్మర్పల్లి ,వేల్పూర్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని, వీటిని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
