మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని పేర్కొన్నారు.

వరంగల్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధతో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప, వేయిస్తంభాల గుడికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. భక్తుల అవసరాలకు తగ్గట్టు వసతులు సమకూరుస్తామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం లేఖ రాశానని తెలిపారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని అన్నారు.
