హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు మొత్తం నగరంలో చర్చనీయాంశమైన ఆ ఖరీదైన గడియారం ఎట్టకేలకు పోలీసుల వద్దనే ఉన్నట్లు నిర్ధారణ జరిగింది.

రూ.25లక్షల విలువైన వాచ్‌ను నిందితుడి అరెస్ట్ సమయంలో కొట్టేసిన పోలీసుల తీరుపై ప్రతిచోటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఎపిసోడ్‌ను ఎలాగోలా ముగించేయాలని చూస్తున్న ఉన్నతాధికారులకు ఎక్కడ నుంచి మొదలుపెట్టి ఎక్కడ క్లోజ్ చేయాలంటూ తర్జనభర్జన పడుతున్నారని, తాము వాచ్ దొంగతనం జరిగిందని ప్రకటిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుస పరిణామాల మధ్య అది తమకు మచ్చ అంటూ వారు ఆవేదనవ్యక్తం చేశారు.
