మండలంలోని కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్పార్టీలో చేరారు. వీరికి బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.

లంబాడి తండా (డీ) గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్మీర గాజు నాయక్, గ్రామ ప్రధాన కార్యదర్శి బిలావత్ తిరుపతి నాయక్ , మాజీ సర్పంచ్ అజ్మీరా తిరుపతి నాయక్‌ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
