ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతు తాను పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక అగచాట్లు పడుతున్నాడు.

వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండించిన రైతు తాను పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక అగచాట్లు పడుతున్నాడు. రబీలో వరి కోత లు ప్రారంభమై పక్షం రోజులు దాటినా ఇప్పటికీ అధికారులు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తే ఇప్పటి వర కు ఒక్క ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రా న్ని ఏర్పాటు చేయకపోయినా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కనీసం స్పందించలేదు.
