ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు.

దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కే అవకాశం లేదు. కనీసం అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా.. ప్రస్తుత బయట మార్కెట్లో రూ.1600, రూ.1700లకే కొనుగోలు చేస్తుండడంతో క్వింటాలుకు రూ.700ల వరకు రైతులు నష్టపోతున్నారు
కుభీర్, ఏప్రిల్ 6 : ప్రభుత్వం రబీలో మక్క, శనగ, జొన్న సాగు చేయాలని సూచించడంతో నిర్మల్ జిల్లావ్యాప్తంగా రైతులు అధికంగా మొక్కజొన్న వేశారు. దిగుబడులు అధికంగా వస్తాయని సాగు చేసిన వారికి నిరాశే ఎదురవుతున్నది. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కే అవకాశం లేదు. కనీసం అమ్ముకోలేని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా.. ప్రస్తుత బయట మార్కెట్లో రూ.1600, రూ.1700లకే కొనుగోలు చేస్తుండడంతో క్వింటాలుకు రూ.700ల వరకు రైతులు నష్టపోతున్నారు.
