ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.

అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మొక్కజొన్న పరిశ్రమ వద్ద పిడుగుపాటుకు కన్నయ్య అనే కూలీ మృతి చెందాడు. మరో నలుగురుకి గాయాలు కాగా యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు.
