ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ, ఎమ్మార్పీస్, సీఐటీయూ, జేఏసీ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేశారు. మరి కొందరికి హౌస్ అరెస్టు కూడా చేశారు.

బీఆర్ఎస్ నాయకులు అజీజ్ ఖురేషి, అమీద్ ఉన్నారు. ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, బీఆర్ఎస్ నాయకులు భరత్ చౌహన్, బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణీ రాజేశ్, బీజేపీ నాయకులు కిరణ్, వెంకటేశ్‌లను అరెస్టు చేశారు. ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కాంబ్లే బాలాజీను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కుంటాలలో కూడా కల్లూర్ సర్పంచ్ దశరథ్, మండల పార్టీ కన్వీనర్ పడకంటి దత్తాత్రిలను అరెస్టు చేశారు.
