ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు

ఖమ్మం సిటీ, ఏప్రిల్ 6: ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు విధిగా పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే ని ఘనంగా నిర్వహించారు. తొలుత అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహార భద్రత ప్రమాణాల గురించి ప్రజలు, ఫుడ్ వ్యాపారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
