ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.

ఖమ్మం రూరల్, ఏప్రిల్ 6: ప్రతి విద్యార్థికి సంబంధించిన హెల్త్కార్డును రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఖమ్మంరూరల్ కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాల్లో తిరుగుతూ మౌలిక సదుపాయాలు, వంటగది, స్టోర్రూం, ఇతర నిత్యావసర సరుకులు బియ్యం, కూరగాయలు, రిజిస్టార్స్ తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు.
