ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణికి ప్రజలు పోటెత్తారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడిన కలెక్టర్.. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరించాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 95 వినతులు రాగా, వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖలకు రిఫర్ చేశా
