ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది.

బజార్హత్నూర్, జూలై 10 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని ప్రభు త్వ దవాఖాన వైద్య సిబ్బంది ఎక్స్పైరీ మందులు ఇవ్వడంతో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది. గర్భిణి ఇటీవల దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకోగా వైద్యులు ఫోలిక్ యాసిటడ్ మాత్ర లు ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఆ మందులు వాడగా తీవ్ర రక్తస్రావమైంది. కు టుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు.
