కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు..

రుద్రంపూర్, జూలై 11 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CMOAI) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఏరియా మహిళ కెమిస్ట్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కెమిస్టులు, కార్మికులు మాట్లాడుతూ CMOAI చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవన్నారు.
