వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్నది

వానకాలం పారంభమై నెల రోజులైనా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు కలత చెందుతున్నారు. ఇప్పటికే పొలాలను దున్ని, విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు నిరాశే ఎదురవుతు న్నది. అడపా దడపా కురుస్తున్న మోస్తారు వర్షాలు భూమిని తడపడానికే తప్ప, జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లో చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగుతో పాటు సదర్మాట్ ఆనకట్ట కింద దాదాపు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
