ప్రభుత్వం గర్భిణులకు అందించే పౌష్టికాహారాన్ని తీసుకుని తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నూతన సర్పంచులు కోరారు.

పోతంగల్ : ప్రభుత్వం గర్భిణులకు అందించే పౌష్టికాహారాన్ని తీసుకుని తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని నూతన సర్పంచులు కోరారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లపల్లిఫారం అంగన్వాడీ కేంద్రంలో గురువారం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
