మణుగూరు ఏరియా సింగరేణి మల్లేపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ఇటీవల పనులు చేపట్టిన యాజమాన్యం పనుల్లో ఉపయోగిస్తున్న వాహనాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రుద్రంపూర్, జనవరి 22 : మణుగూరు ఏరియా సింగరేణి మల్లేపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ఇటీవల పనులు చేపట్టిన యాజమాన్యం పనుల్లో ఉపయోగిస్తున్న వాహనాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ అధికారి పి.భూషిత్ రెడ్డిని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని, సాంకేతిక లోపాలతో ఉన్న వాహనాలను యథేచ్ఛగా నడుపుతూ కార్మికుల భద్రత, ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల్లో బ్రేకులు, లైట్లు, సేఫ్టీ అలారాలు వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా, అక్కడి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నా
