
హైదరాబాద్ (శ్రీరామ్ చక్రీ,న్యూస్)14/4/2026
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్, సుభాష్ చంద్రబోస్ కాలనీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో హస్సేనాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అలాగే నల్ల పోచమ్మ దేవాలయం చైర్మన్ నారగోని శ్రీనివాస్ యాదవ్, స్థానిక కార్పొరేటర్లు మరియు టిఆర్ఎస్ నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
