ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ సభలు గందరగోళం మధ్య కొనసాగాయి. సమస్యలు పరిష్కరించాలని అధికారులను సర్పంచ్‌లు, ప్రజలు నిలదీశారు.

మండలంలోని కేస్లాపూర్, తేజాపూర్, ధోడంద, హర్కాపూర్తండా, ఏమాయికుంట సర్పంచ్‌లు మెస్రం తుకారామ్, కోవా రాజేశ్వర్, పవార్ చంగునదూదిరాం, రాథోడ్ రోహిదాస్, జాదవ్ లఖన్సింగ్లతోపాటు మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ మసూద్, మిర్జా జిలానీబేగ్లు తాగునీటి, ఉపాధి హామీ పథకం సాంకేతిక సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, పీఆర్ శాఖలోని ఎన్ఆర్ఈజీఎస్ రోడ్డు మంజూరు నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ.. అధికారులు ప్రజల కోసం పనులు చేయాలని.. సర్పంచ్‌లు, నాయకులతో కలిసి సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అలాగే భైంసా మండలంలోని వానల్పాడ్ రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జి ఎంపీడీవో ప్రదీప్‌ను సర్పంచ్‌లు నిలదీశారు.
