పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌ను డీసీపీ బి.రామ్ రెడ్డి నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏసీపీ జి.కృష్ణయాదవ్‌తో కలిసి సోమవారం రాత్రి స్టేషన్ వచ్చిన ఆయన.. స్టేషన్ భౌగోళిక పరిస్తఇతులు, సిబ్బంది పనితీరు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఎస్సై మల్లేశ్‌ను డీసీపీ ఆరా తీశారు. నేరాల నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సైకి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో తరచూ పర్యటించాలని సూచించారు. నేరాల నియంత్రణకు సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాపర్టీకి సంబంధించిన నేరాలపై, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.
