సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 7: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ నాగేంద్ర చారి హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం సిరిసిల్ల పట్టణంలోని సిక్కులవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలు కూడా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు
