పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ పారితోషికంతోపాటు కుల గణన పారితోషికాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి.

కామారెడ్డి, ఏప్రిల్ 7 : పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ పారితోషికంతోపాటు కుల గణన పారితోషికాన్ని చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణంలోని పదోతరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయ సంఘాల జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో టీచర్లు నిరసన తెలియజేశారు.
