తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి

న్యూఢిల్లీ: కేరళ మాజీ సీఎం పినరయి విజయన్(Pinarayi Vijayan) నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తిరువనంతపురంలోని ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో మొత్తం 12 ప్రదేశాల్లో ఆ సోదాలు జరుగుతున్నాయి. కన్నూరులోని విజయన్ నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది. కొచ్చిన మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ సంస్థ విజయన్ కుమార్తె టీ వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ అనే కంపెనీకి సుమారు 1.72 కోట్ల అక్రమ పేమెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి 2019 మధ్య ఆ లావాదేవీలు జరిగాయి.
