చంద్రుడిపై శాశ్వత మానవ బేస్‌ను ఏర్పాటు చేసేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొత్తగా మూడు మిషన్లు చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. పర్మనెంట్ బేస్‌ను చంద్రుడిపై నిర్మించేందుకు సుమారు 20 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతోందని నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మాన్ తెలిపారు.

టెక్సాస్: చంద్రుడు మీదకు రోవర్లను పంపిన నాసా.. ఇప్పుడు అక్కడ శాశ్వత మానవ బేస్(Moon Base)ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొత్తగా మూడు మిషన్లు చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. మీడియా సమావేశంలో నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మాన్ మాట్లాడుతూ.. పర్మనెంట్ బేస్‌ను చంద్రుడిపై నిర్మించేందుకు సుమారు 20 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతోందన్నారు. లూనార్ రోవర్లు, డ్రోన్లను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదకరమైన వాతావరణంలో ప్రయోగాలు నిర్వహించే రీతిలో అక్కడ ఏర్పాట్లను కల్పించనున్నారు.
