కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు.

కారేపల్లి, మే 19 : కారేపల్లి మండలంలోని మొక్కజొన్న స్టాక్ పాయింట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మార్కెటింగ్ శాఖ డీఎం జే.నరేందర్ మంగళవారం తనిఖీ చేశారు. అప్పాయిగూడెం గోదాం, జిన్నింగ్ మిల్ స్టాక్ పాయింట్లను డీఎం పరిశీలించారు. సోమవారం రాత్రి కారేపల్లిలో రైతులు అందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ రైతు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కారేపల్లి మండల రైతుల మొక్కజొన్నను స్ధానికంగానే దిగుమతి చేయడానికి అవకాశాలు పరిశీలించాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు.
