భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నిప్పులు కక్కుతున్నాడు. ఈ తరుణంలో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు ప్ర‘తాపం’ చూపుతుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.

ఎండవేడిమి, ఉక్కపోతతో ఉడికి పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, రానున్న రోజుల్లో ఎండ మరింత దంచికొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టేందుకు జంకుతున్నారు.
