వుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది.

రంగారెడ్డి;విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిన్నాయి. గత కేసీఆర్ ప్రభు త్వం జిల్లా పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటుచేసి ప్రత్యేక నిధులు కేటాయించడంతో త్వరితగతిన అభివృద్ధి చెంది.. ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా సమకూర్చుతున్నాయి.
