తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ ప్రక్రియపై ఉర్రూతలూగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోతున్న సర్(ఎస్ఐఆర్)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తుండగా కేంద్రంలో అధికారం చలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ ప్రక్రియపై ఉర్రూతలూగుతోంది. మిగిలిన రాజకీయ పక్షాలు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రక్రియపై దుమారం రేగుతోన్న దరిమిలా రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులను భారత రాష్ట్ర సమితి అప్రమత్తం చేసింది. బీజేపీ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్న క్రమంలో అడుగడుగునా అలర్ట్గా ఉండాలని శ్రేణులను పిలుపునిచ్చ
