మండలంలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అక్రమార్కులందరూ సిండికేట్గా మారడం గమనార్హం.

నందిపేట్, మే 28: మండలంలో నల్లమట్టి వ్యాపారం జోరుగా సాగుతున్నది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కొందరు అక్రమార్కులు పెద్ద పెద్ద యంత్రాల ద్వారా మట్టి తవ్వకాలు చేపట్టి, టిప్పర్ల ద్వారా తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. అక్రమార్కులందరూ సిండికేట్గా మారడం గమనార్హం. గ్రామాల్లో పెద్దమనుషులుగా చెలామణి అయ్యే వారికి డబ్బులు ముట్టజెప్పి నల్లమట్టి దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. వారం పది రోజులుగా నందిపేట్ మీదుగా ఆర్మూర్ చుట్టుపక్కల మండలాలకు నిత్యం టిప్పర్ల ద్వారా నల్లమట్టిని తరలిస్తున్నారు.
