ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్నది.

ధర్మపురి: ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఒకసారి సమై క్య రాష్ట్రంలో కూడా విస్తరించారు. నాటి పాలకులకు పక్కా ప్రణాళిక లేకపోవడంతో కూల్చివేసిన ఓ ఆలయం స్థానంలో ప్రస్తుతం చెప్పుల స్టాండ్ కొనసాగుతున్నది. 35 ఏండ్ల క్రితం వరకు లక్ష్మీనరసింహస్వా మి దేవస్థానం ముందు విఠలేశ్వర స్వామి ఆలయం ఉండేది. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న విఠలేశ్వరస్వామి ఆలయంలో నిత్యపూజలు జరిగేవి. ఆ ఆలయాన్ని అభివృద్ధి పేరుతో 35 ఏండ్ల కిత్రం కూల్చివేశారు. ఆలయంలో ఉన్న శివపార్వతుల పంచలోహ విగ్రహాలను రామలింగేశ్వరాలయంలో భద్రపరిచారు. కానీ కొద్ది రోజులకే అ విగ్రహాలు మాయమయ్యాయి. ఆ ఘటనపై ఎలాంటి విచారణ జరుగలేదు.
