నల్లగొండ మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రాంతాల్లోనే వైన్స్‌లు ఏర్పాటు చేయాలి. నా అనుచరులు, నావర్గానికి ఇబ్బంది లేకుండా చూడాలి. లేదంటే మీపై యాక్షన్ తప్పదు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్సైజ్ అధికారులను ఆదేశించా

మున్సిపాలిటీలో వైన్స్ షాపులు దకించుకున్న వ్యక్తులు ఎకడైనా ఏర్పాటు చేసుకునే హకు ఉన్నది. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంటరై తన అనుచరులకు ఇబ్బంది లేకుండా తాను చెప్పిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రామగిరి రామాలయం సమీపంలో ఓ వైన్స్ చాలాకాలంగా నడుస్తోంది. అది ఈసారి ఒక వర్గానికి రావడంతో వాళ్లని వెంటనే అకడ నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఆదేశించినట్లు తెలుస్తోంది
