సాలూరా మండలంలోని హున్సా, ఖాజాపూర్, మంధర్నా గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఆయా గ్రామాల్లో విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. ఎక్కడా ఆ దాఖలాలు లేవని విమర్శించారు. వర్షాలకాలంలో సైతం పంట నష్టం జరిగినా, వివరాలు సేకరించినా ఇంతవరకూ ఒక్క రూపాయి కేటాయించలేదని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు నష్టం జరిగినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
