నా కోరిక తీరిస్తేనే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులతో విసిగిపోయిన మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాధితురాలి కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన మహిళ ఇల్లు కూలిపోవడంతో రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటుంది. దీంతో ఇందిరమ్మ ఇల్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ నాయకుడిని ఆశ్రయించగా.. తన కోరిక తీర్చాలని.. అప్పుడే ఇల్లు మంజూరు చేయిస్తానని చెప్పాడు. అందుకు సదరు మహిళ నిరాకరించింది. దీంతో కక్ష గట్టిన కాంగ్రెస్ నాయకుడు.. డబుల్ బెడ్రూం ఇళ్ల జాబితాలో తన పేరు వచ్చినా తొలగించాడని బాధిత మహిళ సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని పేర్కొంది.
