రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది.

నాగర్కర్నూల్, జూన్ 12 : రుతుపవనాలు తెల ంగాణను తాకినా నాగర్కర్నూల్ జిల్లాలో మా త్రం ఇంకా వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. ఇప్పటికే జిల్లాను రుతుపవనాలు తాకి వర్షాలు కురవాల్సి ఉండగా వరుణు డు కరుణించడం లేదు. వేసవి ముగిసి వానకాలం ప్రారంభం కావడంతో ఇప్పటికే రైతులు జిల్లాలో తమ పంట పొ లాలు దున్ని చదును చేసుకొని సా గుకు సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనా లు జూన్ 8వ తేదీన జోగుళాంబ గద్వాల జిల్లా మీ దుగా ప్రవేశించి రెం డు రోజుల్లో రా ష్ట్రం అంతటా విస్తరించినప్పటికీ నాగర్కర్నూల్ జిల్లాలో మాత్రం రైతన్నలు వరుణుడికోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
