రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.

పాలకుర్తి/కొడకండ్ల, జూన్ 12 : రైతులు ఆరుగాలం కష్టించి వడ్లు పండిస్తే కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారని తెలిపారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జే) గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు విఫలమయ్యారని మండిపడ్డారు.
