నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా జరుగుతుంది.

మాగనూరు : నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో అక్రమ ఇసుక ( Illegal sand ) జోరుగా రవాణా జరుగుతుంది. ఇసుక రవాణాకు అనుమతులు లేకుండానే బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని మందిపల్లి వాగు- చిట్యాల మధ్యలో సుమారు రూ. 22 కోట్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. అయితే బ్రిడ్జి ( Bridge ) నిర్మాణానికి అక్రమంగా ఇసుక డంపులు చేపట్టి వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
